వెంకటేశ్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం (ఏకే47). ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా వేశారు. వచ్చేనెల 9న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.
రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. చెప్పిన డేట్‌కే రిలీజ్ చేసేలా కనిపిస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగానే ఈ రోజు ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే రావాల్సిన ఈ సాంగ్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
కానీ ప్రమోషన్స్ జోరు చూస్తుంటే ఆదర్శ కుటుంబం వాయిదా పడేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఇది సినిమా షెడ్యూల్ ప్రకారం థియేట్రికల్ విడుదల కానుందని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో మరోసారి ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో పూజిత పొన్నాడ, రావు రమేష్, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.


