తెలుగులో అదే చేశా.. ఇక్కడ కూడా ఫాలో అవుతున్నా: శ్రీలీల | Actress Sreeleela Comments On Kollywood Entry In Movies | Sakshi
Sakshi News home page

Sreeleela: 'తెలుగులో అదే చేశా.. ఇక్కడ కూడా ఫాలో అవుతున్నా'

Sep 27 2026 8:05 AM | Updated on Sep 27 2026 8:05 AM

Actress Sreeleela Comments On Kollywood Entry In Movies

డాక్టర్‌ నుంచి యాక్టర్‌ అయిన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల.  తెలుగులో పెళ్లి సందడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఈ కన్నడ బ్యూటీ తొలి చిత్రంతోనే తన అందం, డాన్స్‌లతో ఆకట్టుకుంది. ఆ తరువాత చిన్న గ్యాప్‌ వచ్చినా, ధమాకా చిత్రంలో రవితేజతో జత కట్టి  మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరోలతో జత కట్టే అవకాశాలను అందుకున్నారు. అదేవిధంగా ప్రత్యేక పాటల్లోనూ నటిస్తూ తన క్రేజ్‌ పెంచుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఇతర భాషా చిత్రాల్లోనూ నటించే  ఛాన్స్‌లు వస్తున్నాయి.

ఈ ఏడాది పరాశక్తి చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన.. శ్రీలీల నటిగా మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం ధనుశ్‌కు జంటగా ఓం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఏ భాషలో నటించినా ఆ భాషాకు చెందిన అభిమానులను ఆకట్టుకోవాలని అంటోంది శ్రీలీల. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. నేను తెలుగులో అదే చేశానని.. ఇప్పుడు తమిళ సినీ అభిమానులపై గురి పెట్టానని తెలిపింది. కచ్చితంగా నేను తమిళ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటానని  శ్రీలీల అన్నారు. ప్రస్తుతం శ్రీలీల చేసిన కామెంట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement