వెంకీ–త్రివిక్రమ్ సినిమాపై ఎందుకీ సైలెన్స్?.. బజ్ తగ్గిందా? | Adarsha kutumbam: Why silence regarding Venkatesh Trivikram movie | Sakshi
Sakshi News home page

వెంకీ–త్రివిక్రమ్ సినిమాపై ఎందుకీ సైలెన్స్?.. బజ్ తగ్గిందా?

Sep 26 2026 11:51 PM | Updated on Sep 27 2026 12:16 AM

Adarsha kutumbam: Why silence regarding Venkatesh Trivikram movie

విక్టరీ వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఒకప్పుడు భారీ క్రేజ్ కనిపించింది. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందనే వార్తలతోనే సోషల్ మీడియాలో సందడి నెలకొంది. అప్పట్లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తరహాలో మరో సినిమా వస్తుందంటూ సినీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ విడుదలకు మరో రెండు వారాలు మాత్రమే ఉంది. కానీ ప్రస్తుతం ఆ స్థాయి బజ్ మాత్రం కనిపించడం లేదనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా ప్రమోషన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి. ఇప్పటికే రావాల్సిన ఈ సినిమా పాటలు విడుదల కాలేదు. ట్రైలర్ కూడా ఇంకా రాలేదు. దీంతో సినిమాపై ఉండాల్సిన ఆసక్తి క్రమంగా తగ్గుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావాలనే ఈ సినిమాను లో-ప్రొఫైల్‌లో ఉంచుతున్నారా? లేక విడుదలకు ముందు ఒక్కసారిగా ప్రమోషన్స్ పెంచాలనే ఆలోచనలో ఉన్నారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్‌కు సంబంధించిన కామన్ ఇంటర్వ్యూ కూడా ముందుగానే షూట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి పెద్దగా అప్‌డేట్స్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌కు ఇంకా సరిగ్గా రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రమోషన్స్ ఎలా ఉంటాయో, ఈ సినిమాపై బజ్‌ను మేకర్స్ ఎలా పెంచుతారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement