ఫ్రీ ఎడ్యుకేషన్‌ ప్రకటించిన మోహన్‌బాబు.. ఎవరికంటే..? | The Paradise Movie Success Meet Speech Mohan Babu About Free Education | Sakshi
Sakshi News home page

నా యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్‌ ఇస్తా.: మోహన్‌బాబు

Sep 26 2026 7:31 PM | Updated on Sep 26 2026 7:48 PM

The Paradise Movie Success Meet Speech Mohan Babu About Free Education

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ప్యారడైజ్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సిడ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.  ఈ మేరకు హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మోహన్‌బాబు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తనకు తమ్ముడిలాంటి గద్దర్‌ను గుర్తుచేసుకున్నారు. గద్దర్‌ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని చెబుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘నాకు తమ్ముడి లాంటి వారు గద్దర్‌. ఆయన పిల్లలు మా స్కూల్‌లోనే చదువుకున్నారు. రచయితలు అంటే నాకు చాలా ఇష్టం’’ అని మోహన్‌బాబు తెలిపారు.

 రెండు సంవత్సరాల పాటు ఉచితంగా.. 
ఈ సందర్భంగా ఓ రచయిత మృతి చెందిన విషయం తనకు తెలిసిందని గుర్తుచేసుకున్న మోహన్‌బాబు.. ఆయన కుమారుడిని స్టేజ్‌పైకి పిలిపించారు. అనంతరం అతడు ప్రస్తుతం ఏం చదువుతున్నాడని అడిగారు. ఫార్మసీ చదువుతున్నానని అతడు చెప్పడంతో.. ‘‘మా దగ్గర ఎం.ఫార్మసీ కూడా ఉంది’’ అని మోహన్‌బాబు తెలిపారు.

అంతేకాదు, అతడికి రెండు సంవత్సరాల పాటు ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. ‘నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివి అవ్వాలి’’ అంటూ ఆశీర్వదించారు. సక్సెస్‌ మీట్‌ వేదికగా మోహన్‌బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన చూపించిన ఆప్యాయత, విద్యకు ఇచ్చిన ప్రాధాన్యంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా మరోసారి మోహన్‌బాబు తన గొప్ప మనసును చాటుకున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్‌’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా: కేటీఆర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement