‘రాయవలస’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Rayavalasa Movie Release Date Fix | Sakshi
Sakshi News home page

‘రాయవలస’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Sep 26 2026 7:08 PM | Updated on Sep 26 2026 7:41 PM

Rayavalasa Movie Release Date Fix

కార్తిక్ జయంతి హీరోగా పరిచయమౌతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాయవలస’.  రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి  గోపీ కృష్ణ జె నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.  డెబ్యూ హీరో అయినప్పటికీ కార్తిక్ జయంతి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. 

తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో కార్తిక్ త్రిశూలంతో అమ్మవారి విగ్రహం ముందు నిలబడి వుండటం పవర్ ఫుల్ గా ఉంది.

ఈ చిత్రంలో శ్రీష నులు హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులతో పాటు త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement