breaking news
Rayavalasa Movie
-
విశ్వక్ సేన్ చేతుల మీదుగా ‘మా ఊరు రాయవలస’సాంగ్ రిలీజ్!
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మాణంలో రాధిక జయంతి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయవలస’. కార్తీక్ జయంతి, శ్రీష నులు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘మా ఊరు రాయవలస’ పాటను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఆస్కార్ విజేత ‘నాటు నాటు’ పాటతో గుర్తింపు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు.ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘రింగుడు రింగుడు’ ఇప్పటికే 12 లక్షలకు పైగా వ్యూస్‌తో ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఈ పాట విజువల్స్‌ను అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించడం విశేషం. అర్జున్ బాల సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నారు. -
యూట్యూబ్‌లో అదరగొడుతున్న ‘రింగుడు రింగుడు’ పాట
గోపీ కృష్ణ.జె నిర్మాతగా.. ఎన్నారై రాధిక జయంతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయవలస’. కార్తీక్ జయంతి, శ్రీషా నులు ప్రధాన పాత్రలు చేశారు. అమెరికా నుంచి కార్తీక్ జయంతి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. రీసెంట్గా విడుదల చేసిన ‘రింగుడు రింగుడు’ సాంగ్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది.గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ‘రాయవలస’ రూపొందించారు. నటీనటులు, సాంకేతిక బృందం అంకితభావంతో ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేశారు. అర్జున్ బాల మ్యూజిక్ డైరెక్టర్ కాగా పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ పాటలకు సాహిత్యం అందించారు. సినిమా కి సంబంధించిన రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్న చిత్ర బృందం. -
‘రాయవలస’ రిలీజ్ డేట్ ఫిక్స్
కార్తిక్ జయంతి హీరోగా పరిచయమౌతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాయవలస’. రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపీ కృష్ణ జె నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. డెబ్యూ హీరో అయినప్పటికీ కార్తిక్ జయంతి పవర్ఫుల్, ఇంటెన్స్ లుక్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో కార్తిక్ త్రిశూలంతో అమ్మవారి విగ్రహం ముందు నిలబడి వుండటం పవర్ ఫుల్ గా ఉంది.ఈ చిత్రంలో శ్రీష నులు హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులతో పాటు త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


