విశ్వక్ సేన్ చేతుల మీదుగా ‘మా ఊరు రాయవలస’సాంగ్‌ రిలీజ్‌! | Maa Ooru Ravivalasa Song Released From Rayavalasa Movie | Sakshi
Sakshi News home page

విశ్వక్ సేన్ చేతుల మీదుగా ‘మా ఊరు రాయవలస’సాంగ్‌ రిలీజ్‌!

Oct 25 2026 4:09 PM | Updated on Oct 25 2026 4:09 PM

Maa Ooru Ravivalasa Song Released From Rayavalasa Movie

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మాణంలో రాధిక జయంతి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయవలస’. కార్తీక్ జయంతి, శ్రీష నులు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్‌ ‘మా ఊరు రాయవలస’ పాటను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఆస్కార్ విజేత ‘నాటు నాటు’ పాటతో గుర్తింపు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ ‘రింగుడు రింగుడు’ ఇప్పటికే 12 లక్షలకు పైగా వ్యూస్‌తో ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఈ పాట విజువల్స్‌ను అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించడం విశేషం. అర్జున్ బాల సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement