ఇడుపు కాయితం సాంగ్.. ట్రోల్స్‌పై డైరెక్టర్ రియాక్షన్ | Director Venu Udugula on Idupu kayitham Movie song trolls | Sakshi
Sakshi News home page

Idupu kayitham Movie: ఇడుపు కాయితం సాంగ్.. ట్రోల్స్‌పై డైరెక్టర్ రియాక్షన్

Oct 25 2026 3:14 PM | Updated on Oct 25 2026 3:29 PM

Director Venu Udugula on Idupu kayitham Movie song trolls

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వస్తోన్న రూరల్ ఎంటర్‌టైనర్‌ ఇడుపు కాగితం. ఈ మూవీ టైటిల్‌ ప్రకటనతోనే ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ యాసలో టైటిల్ ఉండడంతో అప్పట్లో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అసలు ఈ టైటిల్‌కు మీనింగ్ ఏంటని కొందరు వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. ఆ తర్వాత టైటిల్‌పై పెద్దఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలోని సీన్స్ సైతం వివాదానికి దారితీశాయి. ఇందులో పెళ్లిలో మందు పోయడం మీరు చూపించినట్లుగా ఉండదని కొందరు ట్రోల్స్ మొదలెట్టారు. తెలంగాణ సంస్కృతిని వక్రీకరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మీ సినిమా ప్రమోషన్స్ కోసం తెలంగాణ సంస్కృతిని కించపరచొద్దని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ట్రోల్స్‌పై టాలీవుడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల స్పందించారు. సాంగ్‌లోని సీన్స్‌పై వస్తున్న ట్రోల్స్‌పై గట్టిగానే ఇచ్చిపడేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తెలంగాణ సంస్కృతిపై సరైన అవగాహన లేకుండా సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. నిజ జీవితాలను, మట్టి వాసనను తెరపైకి తెచ్చే ఇలాంటి సినిమాలకు అండగా నిలవాలని దర్శకుడు కోరారు.

వేణు తన పోస్ట్‌లో రాస్తూ..'ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి. దాని చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి. తెలంగాణను కించపరచడం సులువు. అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం కావాలి. మన జీవితాల్ని, సంస్కృతుల్ని నిజాయితీగా తెరమీదకు తీసుకొచ్చే ఇడుపు కాయితం లాంటి సినిమాలను ఆదరిద్దాం.సినిమా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే విమర్శించండి. కానీ ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని మీ అజ్ఞానంతో నిర్వచించకండి' అని రాసుకొచ్చారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement