రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఊహించని విధంగా కళ్లచెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ కంటెంట్‌తో పాటు సాంగ్స్ సైతం ఆడియన్స్‌ను ఊపేశాయి. ముఖ్యంగా అయ్యప్ప సాంగ్ ఆడియన్స్‌తో పాటు అభిమానులను అలరించింది. థియేటర్లలో ఈ పాటకు పూనకాలు ఊగిపోయారు. అంతలా ఇరుముడి సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా ఓ చిన్నారి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇరుముడి చిత్రంలోని మల్లెపూల పల్లకి.. మందార పల్లకి.. మణికంఠుడు ఎక్కినాడు మందార పల్లకి.. అంటూ సాగే అయ్యప్ప సాంగ్‌కు చిన్నారి చేసిన డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అచ్చం రవితేజ స్టైల్లో స్టెప్పులు వేస్తూ అక్కడున్న వారిని అలరించింది. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ చిన్నారి డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. ఇకెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
Dancing So Wonderfully At Such A Young Age Is Truly Amazing 👏🔥 #RaviTeja | #IRUMUDI https://t.co/v4eypkdtsh
— Hari SaaHo (@HariSaaho19) October 24, 2026


