నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. మితిమీరిన వయొలెన్స్ ఈ సినిమాను ఆడియన్స్‌కు దూరం చేసింది. ఓ జాతి మనుగడ కోసం చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సవారీల జాతి తమ గుర్తింపు కోసం చేసే పోరాటమే ఈ ప్యారడైజ్ మూవీ. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా మెప్పించింది.
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ మూవీని వీక్షించాడు ప్రిన్స్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని. నాని జెర్సీ మూవీకి వీరాభిమాని అయిన గౌతమ్.. తాజాగా ఓటీటీకి వచ్చేసిన ది ప్యారడైజ్ సినిమాకు తన రేటింగ్ ఇచ్చాడు. నాకు సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సన్నివేశాల్లో నటన నచ్చింది. కానీ మిగతాదేమీ నాకు నచ్చలేదు. ఈ సినిమా నన్ను చాలా నిరాశపరిచింది. అలాగే ఎడిటింగ్ కూడా చాలా దారుణంగా ఉందంటూ తన రివ్యూ ప్రకటిస్తూ కేవలం వన్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. గౌతమ్ రివ్యూ చేసిన నాని సినిమాకు ఇచ్చిన అత్యల్ప రేటింగ్ ఇదే కావడం విశేషం. ఇది కాస్తా నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

కాగా.. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తన లెటర్ బాక్స్‌డ్ ఐడిని జోడించాడు. ఇందులో తన తండ్రి చిత్రాలతో పాటు ఇతర సినిమాలకు అతను ఇచ్చిన రేటింగ్స్ ఇచ్చాడు.


