బన్నీ సినిమా దెబ్బకు ఎన్టీఆర్‌కి జెలసీ! | Ntr Jealous Trivikram Made Ala Vaikunthapurramuloo After Aravinda Sametha | Sakshi
Sakshi News home page

NTR: తారక్‌కి మా మీద పీకలదాకా కోపం ఉంది

Oct 25 2026 3:16 PM | Updated on Oct 25 2026 3:29 PM

Ntr Jealous Trivikram Made Ala Vaikunthapurramuloo After Aravinda Sametha

తెలుగులో ‍అద్భుతమైన పాటలున్న సినిమాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ఉంటుంది. ఎందుకంటే 2020 సంక్రాంతికి ఈ చిత్రం రాగా అందుకు కొన్ని నెలల ముందు, రిలీజ్ తర్వాత ఈ సాంగ్స్ అంతటా మార్మోగిపోయాయి. అయితే ఈ మూవీ కారణంగా ఎన్టీఆర్‌కి తమ మీద బోలెడంత కోపం ఉందని తమన్, త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ సేతుపతి 'బత్తా' సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు)

'అజ్ఞాతవాసి' డిజాస్టర్ అయిన తర్వాత అదే ఏడాది త్రివిక్రమ్ నుంచి వచ్చిన సినిమా 'అరవిందసమేత'. దసరాకి రిలీజై అద్భుతమైన హిట్ అయింది. దీని తర్వాత త్రివిక్రమ్, బన్నీతో కలిసి 'అల వైకుంఠపురములో' చేశాడు. ఈ రెండింటికీ సంగీత దర్శకుడు తమనే. అయితే తనని మాస్ సినిమాతో కష్టపెట్టి.. బన్నీని స్టైలిష్‌గా చూపించడం, అద్భుతమైన పాటల ఇవ్వడంపై ఫన్నీగానే అయినప్పటికీ తారక్ జెలసీగా ఫీలయ్యాడట. ఈ విషయాన్ని తమన్, త్రివిక్రమ్.. 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో బయటపెట్టారు.

రీసెంట్‌గా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్‍‌లోకి వచ్చింది. ఇందులో ఓ సందర్భంలో తారక్ గురించి చెప్పిన తమన్.. 'జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పటికీ మా మీద కోపం ఉంది. ‘మాకేంట్రా ఏడపోయినావో, ఎప్పుడొస్తావో, ఎప్పుడు వెళ్లిపోతావో పాటలు ఇచ్చావు. వెంటనే బన్నీకి సామజవర గమన, బుట్ట బొమ్మ, రాములో రాముల ఇచ్చావు’ అని ఫోన్ చేసి తిట్టాడు. తారక్ ఎలా మాట్లాడతాడో మీకు తెల్సు కదా సార్. చాలా బాగుంటుంది. చాలా స్వీటెస్ట్ వర్డ్స్' అని తమన్ నవ్వేశాడు. వెంటనే త్రివిక్రమ్ మాట్లాడుతూ..తారక్ ఇద్దరికీ తలంటేశాడు. ‘నన్నేమో ఎండల్లో నిలబెట్టి, మీద దుమ్మేసేసి, చొక్కాలిప్పించేశారు’అని కోప్పడ్డాడు' అని అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు.

ఈ శుక్రవారం(అక్టోబర్ 30) త్రివిక్రమ్ కొత్త సినిమా 'ఆదర్శ కుటుంబం' థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. కుమారస్వామి కథతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కోసం వీళ్లిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. వచ్చే ఏడాది దీని షూటింగ్ మొదలవ్వొచ్చు.

(ఇదీ చదవండి: 'గరివిడి లక్ష్మి'లో అదంతా చూపిస్తున్నారని నాకు చెప్పలేదు: ఆర్నీ పట్నాయక్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement