'గరివిడి లక్ష్మి'లో అదంతా చూపిస్తున్నారని నాకు చెప్పలేదు | Music Director RP Patnaik Reacts Garividi Lakshmi Controversy | Sakshi
Sakshi News home page

RP Patnaik-Garividi Lakshmi: గౌరినాయుడు.. బయోపిక్ చేయడమంటే జోక్ కాదు

Oct 25 2026 1:27 PM | Updated on Oct 25 2026 1:59 PM

Music Director RP Patnaik Reacts Garividi Lakshmi Controversy

గతవారం థియేటర్లలోకి వచ్చిన 'గరివిడి లక్ష్మి ' సినిమా.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మూవీలో నేరుగా ప్రస్తావించనప్పటికీ ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. ఈమెతో పాడిస్తానని చెప్పి, అవకాశం ఇవ్వకుండా మోసం చేశాడన్నట్లు చూపించారు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్.. తన వెర్షన్‌ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ‘గరివిడి లక్ష్మి’మూవీ రివ్యూ)

'ఉత్తరాంధ్ర జానపదం ఏ ఒక్కడి సొత్తు కాదు. వందల ఏళ్లుగా ఈ పాటలు చలామణీలో ఉన్నాయి. గరివిడి లక్ష్మి పాటల్ని తీసుకుని నా సినిమాలో పెట్టుకునే కర్మ నాకు లేదు. 'చిత్రం' సక్సెస్ సెలబ్రేషన్స్ టైంలో దర్శకుడు తేజ, గేయ రచయిత కులశేఖర్‌తో కలిసి వెళ్లి ఆమెని ఒకేసారి కలిశాను. నేను ఇండస్ట్రీకి రాకముందే ఆవిడని కలిసి ఆమె దగ్గర ట్యూన్స్ తీసుకున్నాననేది తప్పు. ఈ గౌరినాయుడు(దర్శకుడు) అనే వ్యక్తి నా గురించి సినిమాలో పెట్టినప్పుడు నన్నెందుకు కలవలేదు? నా అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? సినిమా తీస్తున్నామని చెప్పి విశ్వప్రసాద్(నిర్మాత) నాకు ఫోన్ చేసి ఓ ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే ఆమెని(గరివిడి  లక్ష్మి) కలిశానని అందులో చెబుతుంటే.. అలా కాదు సర్ అని, ఆమెని ముందే కలిశామని నాతో చెప్పించాడు. సినిమా చచ్చిపోకూడదనే ఉద్దేశంతోనే నేను దానికి ఒప్పుకొన్నాను'

'సినిమా వచ్చిన తర్వాత జనాల ఫీడ్ బ్యాక్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే.. నేనేదో ఆవిడ దగ్గర నుంచి ట్యూన్స్ తీసేసుకుని, ఏదో చేశానన్నుట్లు ఉంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అదంతా సినిమాలో చూపిస్తున్నారని నాకు చెప్పలేదు. మీరు కలిశారని చెప్పామన్నాడు. నేను కలిసి, ట్యూన్స్ తీసుకుని ఆవిడని ఏదో చేశానని నాకు ముందే చెప్పుంటే ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాదు. ఉత్తరాంధ్ర జానపదాన్ని నేను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను తప్పితే ఎక్కడా కూడా ఇది గరివిడి లక్ష్మి పాట, వేరే వాళ్ల పాట అని కాదు. ఉత్తరాంధ్ర జానపదం అందరిది'

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

ఇదే ఇంటర్వ్యూలో వైజాగ్‌కి చెందిన శ్రీ మాత ఆడియో కంపెనీ యజమాని నాగభూషణం మాట్లాడుతూ.. బుర్రకథ రికార్డ్ చేసి ఆమెకు మేలు చేశామే గానీ కీడు చేయలేదు. గత మూడేళ్లుగా గౌరినాయుడు మాతో ట్రావెల్ చేశారు. ఆమె పాటల్ని ప్రైవేట్ చేయమంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేం ఆ పనిచేశాం. ఆడియో రైట్స్ రాయించుకున్నాం గానీ ఆవిడ ఆస్తులేం రాయించుకోలేదు. శ్రీ మాత అనే దేవుడి పేరుని దూత కంపెనీ అని మార్చి పెట్టారు. మేమే అన్యాయం చేశాం గౌరి నాయుడు? 2016లో ఆమెని ఘనంగా సన్మానించాం గానీ ఆమెని పక్కకు తోసేశారన్నట్లు వక్రీకరించి చూపించారు' అని ప్రశ్నించారు.

చివరలో ఆర్నీ పట్నాయక్ దర్శకుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'గౌరినాయుడు.. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా. బయోపిక్ చేయడమంటే జోక్ కాదు. ఎవరో ఒకరిని తప్పుగా చూపించి నేను చెప్పాలనుకున్నది చెప్పేద్దామనుకోవడం మోస్ట్ అన్‌ప్రొఫెషనల్ థింగ్. ఈ సందర్భంగా విశ్వప్రసాద్ గారికి కూడా చెబుతున్నా. మంచి దర్శకుల్ని ప్రోత్సాహించండి కానీ బయోపిక్స్ తీస్తున్నప్పుడు మొత్తం అందరి వెర్షన్లని తీసుకుని మూవీ తీయాలి తప్పితే ఒకవైపు తీసుకుని చేస్తే అది బయోపిక్ అవ్వదు. అది మరో సినిమా అవుతుందంతే. బయోపిక్‌గా చూపినప్పుడు మా పాత్రలు చూపించొద్దు. నాతో గౌరినాయుడు అబద్ధాలు చెప్పించాడు' అని అన్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ సేతుపతి 'బత్తా' సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement