ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా | Aadi SI Yugandhar Movie OTT Release Date | Sakshi
Sakshi News home page

SI Yugandhar OTT: థియేటర్లలో రిలీజైనట్లే తెలీదు.. నెలలోపే ఓటీటీకి

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

Aadi SI Yugandhar Movie OTT Release Date

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వీకెండ్ ప్యారడైజ్, డోరతి, ధూమకేతు, సుమో దీదీ, ఐ యామ్ హ్యాండ్సమ్, గజబ్ రాత్, వరం, నా వైఫ్ మిస్సింగ్ లాంటి చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటి సంగతి అలా పక్కనబెడితే ఈ నెలలో థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాయదు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా)

ఆది సాయికుమార్, మేఘలేఖ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'ఎస్ఐ యుగంధర్'. యశ్వంత్ దర్శకత్వం వహించాడు. ఈనెల 2న థియేటర్లలో రిలీజైంది. అసలు ఇదొకటి ఉందని కూడా ప్రచారం చేయకుండానే బిగ్ స్క్రీన్లపైకి తీసుకొచ్చారు. జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది ఈనెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుందని వెల్లడించారు.

'ఎస్ఐ యుగంధర్' విషయానికొస్తే.. నగరంలో వరస హత్యలు జరుగుతూ ఉంటాయి. అలానే ఓ శవం కనిపించకుండా పోతుంది. ఈ కేసుని విచారణ చేసిన ఎస్ఐ యుగంధర్.. ఎలాంటి షాకింగ్ నిజాలు తెలుసుకున్నాడు? ఇంతకీ ఈ మరణాలకు కారణం ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement