రాఖీ యాడ్ వివాదం.. వాళ్లా నన్ను విమర్శించేది?: కృతి సనన్ | Kriti Sanon on hypocrisy during Rakhi ad controversey | Sakshi
Sakshi News home page

Kriti Sanon: నాపై ట్రోల్స్ చేసేది ‍అలాంటి వాళ్లే: కృతి సనన్

Oct 25 2026 1:01 PM | Updated on Oct 25 2026 1:18 PM

Kriti Sanon on hypocrisy during Rakhi ad controversey

తెలుగులో ఆదిపురుష్  మూవీతో క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా వార్తల్లో నిలిచింది. రక్షాబంధన్‌ సందర్భంగా ఓ కంపెనీ యాడ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. అందులో కుక్కకు రాఖీ కట్టడంతో పాటు ఆమె ధరించిన డ్రెస్‌పై పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఆ యాడ్‌ను కంపెనీ పూర్తిగా తొలగించింది.

తాజాగా ఈ వివాదంపై కృతి సనన్ స్పందించింది. కరీనా కపూర్ ఖాన్ చాట్ షోలో పాల్గొన్న ఆమె తనపై వచ్చిన ట్రోల్స్‌ గురించి ప్రస్తావించింది. సోషల్ మీడియాలో తనను ట్రోల్‌ చేసిన వారే తమ ఫ్యామిలీని అసభ్యంగా ట్రోల్ చేశారని తెలిపింది. భారతీయ సంస్కృతిని పరిరక్షిస్తామని చెప్పుకునే వాళ్లే సోషల్ మీడియాలో తన తల్లిదండ్రులు, సోదరిపై అసభ్యకర కామెంట్స్ చేశారని ఆమె వెల్లడించింది.

కృతి మాట్లాడుతూ.. 'నేను నా పోస్టుల కింద వచ్చే కామెంట్లను చదవను. కానీ కొన్నిసార్లు ప్రజలు చాలా నీచంగా ప్రవర్తిస్తారని నాకు అనిపిస్తుంది. సంస్కృతి, గౌరవం గురించి మాట్లాడేవారే నా తల్లిదండ్రులు, సోదరి పోస్టులపై అత్యంత నీచమైన, దుర్భాషలతో కామెంట్ చేశారు. ఆ తర్వాత నా కామెంట్లను ఆఫ్ చేయమని నా సోదరి చెప్పింది. కానీ మహిళలు తమ కోసం తాము నిలబడటం చాలా ముఖ్యం అని నేను భావించా. ఈ వ్యక్తులకు కామెంట్ చేసే హక్కు ఎవరు ఇచ్చారు. ఆ రాఖీ ప్రకటన వివాదం నా గురించి కాదని, అది చాలా పెద్ద సమస్య అని నేను భావించా. మహిళలు ప్రతిదానికీ నిరంతరం నిశితంగా పరిశీలనలో ఉంటారని నాకు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నువ్వు ఏమి ధరించాలనుకుంటున్నావు. ఆమె మరీ పొట్టిగా లేదా పొడవుగా ఉంది. ఓహ్ ఆమె గర్భవతిగా ఉందా? అని చర్చించుకుంటారు. నటీనటులు సులభమైన లక్ష్యాలుగా మారతారు. మేము కూడా మనుషులమే.. ఇది మమ్మల్ని కూడా ప్రభావితం చేస్తుంది. లింగ అసమానత గురించి.. లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్యం గురించి మహిళలు చాలా బలంగా పోరాడాలి. అది బద్దలవ్వాలంటే మనం దానిని చాలాసార్లు బద్దలు కొట్టాలి' అని అన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే  'కాక్‌టెయిల్ 2'లో కృతి సనన్ చివరిసారిగా కనిపించింది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2026, జూన్ 19న థియేటర్లలో విడుదలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement