గోపీ కృష్ణ.జె నిర్మాతగా.. ఎన్నారై రాధిక జయంతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయవలస’. కార్తీక్ జయంతి, శ్రీషా నులు ప్రధాన పాత్రలు చేశారు. అమెరికా నుంచి కార్తీక్ జయంతి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. రీసెంట్గా విడుదల చేసిన ‘రింగుడు రింగుడు’ సాంగ్ యూట్యూబ్లో అదరగొడుతోంది.
గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ‘రాయవలస’ రూపొందించారు. నటీనటులు, సాంకేతిక బృందం అంకితభావంతో ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేశారు. అర్జున్ బాల మ్యూజిక్ డైరెక్టర్ కాగా పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ పాటలకు సాహిత్యం అందించారు. సినిమా కి సంబంధించిన రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్న చిత్ర బృందం.


