బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. | Bala Krishna Dada Movie Update | Sakshi
Sakshi News home page

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్..

Nov 28 2026 8:23 PM | Updated on Nov 28 2026 8:53 PM

Bala Krishna Dada Movie Update

నందమూరి బాలకృష్ణ హీరోగా..గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘దాదా’.  ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే ఈ సినిమా వాయిదా పడనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇచ్చింది. బాలయ్య వేలితో సైగ చేస్తున్న గ్లింప్స్ క్లిప్‌ను షేర్ చేస్తూ.. డిసెంబర్ 24నే సినిమా థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించింది. దీంతో వాయిదా ప్రచారానికి తెరపడింది. కాగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. మంచు మనోజ్ ప్రధాన రోల్‌లో కనిపించనున్నారు. 

(ఇదీ చదవండి: సీత పాత్రపై ట్రోలింగ్‌.. స్పందించిన సాయిపల్లవి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement