సీత పాత్రపై ట్రోలింగ్‌.. స్పందించిన సాయిపల్లవి | Sai Pallavi Interesting Comments On Sita Role And Trolls In Ramayana | Sakshi
Sakshi News home page

సీత పాత్రపై ట్రోలింగ్‌.. స్పందించిన సాయిపల్లవి

Nov 28 2026 8:02 PM | Updated on Nov 28 2026 8:22 PM

 Sai Pallavi Interesting Comments On Sita Role And Trolls In Ramayana

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వచ్చిన మూవీ ‘రామాయణం’.  ఇందులో  సీతాదేవి పాత్రలో కనిపించారు  నటి సాయిపల్లవి.  అయితే ఈ అవకాశం తన జీవితంలోనే ప్రత్యేకమైన ప్రయాణమని ఆమె పేర్కొన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.  

‘ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమాతో మన ప్రయాణం కొనసాగుతుంది. అయితే మనం పోషించే ప్రతి పాత్ర ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. సీత పాత్ర చేసిన తర్వాత నా వ్యక్తిత్వంలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. ఆ అనుభూతులను అందరికీ వివరించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ అవి అర్థం కావాల్సిన పనిలేదు’ అని తెలిపారు.

విమర్శలపై స్పందిస్తూ.. 
సీతమ్మ పాత్రపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ..‘ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. వాటిని అభిప్రాయాలుగానే స్వీకరించాలి. ఇలాంటి విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని మరింత దృఢంగా మారాలి.  బయటి వ్యక్తుల మాటలు పట్టించుకోకుడదు. మనలో మనం బలంగా ఉన్నప్పుడే ముందుకు వెళ్లగలం’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement