తెలంగాణ పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా చిత్రబృందం ‘ఉల్లపూల’ అనే పాటను విడుదల చేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే తన గొంతుతో ఆకట్టుకున్న గాయని ఎవరు? అంటూ నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు.
నల్గొండకు చెందిన హెనాగ్రేస్
ఈ పాటను ఆలపించింది నల్గొండకు చెందిన హెనాగ్రేస్. అభినయ శ్రీనివాస్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. హెనాగ్రేస్ తన మధురమైన గొంతుతో ప్రాణం పోశారు. ఆమె గాన ప్రతిభపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ప్రశంసలు కురిపించారు. ‘హెనాగ్రేస్ తెలంగాణ మట్టిలోని మాణిక్యం. నిజానికి ఈ పాటను పెద్ద సింగర్‌తో పాడించాలని అనుకున్నాం. కానీ సురేశ్ ఈ అమ్మాయి గురించి చెప్పి.. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో నేను కూడా అంగీకరించాను. ఆమె పాట రికార్డింగ్ పూర్తయిన తర్వాతే నేను విన్నాను. విన్న వెంటనే అద్భుతంగా అనిపించింది.
తన గొంతులో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పాట కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ అమ్మాయి కోసమైనా ఈ పాటను మరింతగా ప్రమోట్ చేస్తాను’ అని బన్నీ వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెనాగ్రేస్‌తో స్టేజీ పైనే పాడించారు. ఆమె గాత్రానికి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. పాట పూర్తికాగానే చప్పట్లతో అభినందనలు తెలిపారు.
(ఇదీ చదవండి: అరవింద్ గారు.. నా కోరిక తీర్చండి: డైరెక్టర్ రాజమౌళి)
Raw Voice & Rooted Magic ❤️ Singer #Henagrace sings #Ullipoola at #IdupuKayitham song launch event https://t.co/dH8ZvLos3X
— PRO Suresh (SK Media) (@SKMedia_PR) November 28, 2026


