టాలీవుడ్ ప్రేమకథా చిత్రం.. లవ్ సాంగ్ రిలీజ్ | Tollywood Movie Mohabbat Love song Released | Sakshi
Sakshi News home page

Mohabbat Movie: టాలీవుడ్ ప్రేమకథా చిత్రం.. లవ్ సాంగ్ రిలీజ్

Nov 28 2026 10:35 AM | Updated on Nov 28 2026 10:35 AM

Tollywood Movie Mohabbat Love song Released

సంతోష్ కల్వచర్ల, శ్రేయసి సేన్ ‌ జంటగా నటించిన చిత్రం 'మొహబ్బత్‌'.   ఈ మూవీకి మ్యాక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏబీఎస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై అఫ్రోజ్‌ షేక్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్‌కు ఆడియన్స్‌లో రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని క్రేజీ సాంగ్‌ రిలీజ్ చేశారు. వరమే అంటూ సాగే యూత్‌ఫుల్ సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాటను   డైరెక్టర్ విఐ ఆనంద్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ప్రేమ గీతాన్ని కృష్ణ తేజస్వి ఆలపించగా.. భాష్య శ్రీ  సాహిత్యం అందించారు. ఈ సాంగ్‌ను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో ఈశ్వర్‌ సాయి, మనోజ్‌, సాత్విక్‌, సంతోష్ కల్వచర్ల, శ్రేయసి సేన్ , అజయ్‌ ఘోష్‌, సంతోషి, దుర్గ కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ త్వరలోనే  అధికారికంగా ప్రకటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement