ఓటీటీకి టాలీవుడ్ హిట్‌ మూవీ.. అధికారిక ప్రకటన | tollywood Movie Summer Holidays Ott Streaming date Locked | Sakshi
Sakshi News home page

Summer Holidays Ott: ఓటీటీకి సమ్మర్ హాలీడేస్.. అధికారిక ప్రకటన

Nov 28 2026 8:04 AM | Updated on Nov 28 2026 8:04 AM

tollywood Movie Summer Holidays Ott Streaming date Locked

రోహన్ రాయ్, అరుణ్ దేవ్‌, బేబి ఖుషి  ప్రధాన పాత్రల్లో చిత్రం సమ్మర్‌ హాలీడేస్‌. ఈ మూవీకి శ్రీకర్‌ నాయన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబరు 6న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. బాల్యం, స్నేహం వాటి జ్ఞాపకాల కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీని ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్. వచ్చేనెల 4 నుంచి సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సింజిత్ ఎర్రమల్లి సంగీతమందించారు.

ఈ మూవీ కథేంటంటే..

సిటీలో ఉండే రావూరి వెంకటేష్ అలియాస్ RV (అరుణ్ దేవ్) తండ్రి(హర్షవర్ధన్) చాలా స్ట్రిక్ట్. మార్క్స్, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొమ్మని కొడుకుని ఫోర్స్ చేస్తాడు, రాకపోతే తిడతాడు. సమ్మర్ హాలిడేస్ ముందు ఫస్ట్ ర్యాంక్ రాకపోవడం, తండ్రి బాగా తిట్టడంతో భయపడిన RV ని కూల్ చేయడానికి తల్లి (వాసుకి) మొదటిసారి సమ్మర్ హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకువెళ్తుంది. అక్కడ RV కి కాశి వెంకటేశ్వర్లు అలియాస్ KV(రోహాన్ )పరిచయం అవుతాడు. KVకి చాలా కష్టాలు ఉన్నా చిన్న చిన్న పనులు చేసుకుంటూ స్కూల్ కి వెళ్తూ సరదాగా ఉంటాడు. తల్లికి సొంత డబ్బులతో ఒక్క చీర అయినా కొనివ్వాలి అనుకుంటాడు. వర్మ(రాజీవ్ కనకాల) దగ్గర కొన్ని మామిడి చెట్లు లీజుకి తీసుకొని సాగు చేస్తూ ఉంటాడు KV. మరి KV లైఫ్ లోకి RV ఎలా వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి ఎలా ఎంజాయ్ చేసారు? ఎవరి వల్ల ఎవరి లైఫ్ మారిపోయింది? ఎవరి కష్టాలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement