నాతో ఆడే దమ్ము ఎవరికీ లేదా?.. రెచ్చిపోయిన ఆర్కే.. చివరి కెప్టెన్ ఎవరంటే? | Bigg Boss Telugu season 10 82 day Highlights in episode | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu: నాతో ఆడే దమ్ము లేదా?.. రెచ్చిపోయిన ఆర్కే.. చివరి కెప్టెన్ ఎవరంటే?

Nov 28 2026 7:42 AM | Updated on Nov 28 2026 7:45 AM

Bigg Boss Telugu season 10 82 day Highlights in episode

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 12 వారం ఎండింగ్‌ వచ్చేసింది. ఈ వీకెండ్‌లో ఎవరో ఒకరు హౌస్‌ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. ఈ వారాన్ని బడ్డీ అప్‌ థీమ్‌ను తీసుకొచ్చారు. మాజీ కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకొచ్చిన బిగ్‌బాస్ వారితో ఇంటి సభ్యులతో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచినవాళ్లను చివరి కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌కు ఎంపిక చేశారు. అలా చివరి కెప్టెన్సీ రేసులో  ఆర్కే, దేబ్జానీ, అమన్, నరేశ్, సుధీర్, శివ నిలిచారు.

అయితే మిగిలిన వారిలో ఓ నలుగురికి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ అవకాశం ఇస్తానని బిగ్ బాస్ అంటాడు. ఆ నలుగురు ఎవరో మీరే డిసైడ్ అవ్వండి చెప్తాడు. ఫస్ట్ త్రిగుణ్, వంశీ, ఆర్పీ కలిసి ముకేశ్‌తో ఆడుదామని అనుకుంటారు. కానీ ముకేశ్, వర్షిణి మాత్రం త్రిగుణ్‌ను పక్కన పెట్టాలని చూస్తారు. వర్షిణి సారీ చెప్తే.. తన ఓటు మార్చుకుంటాన అని త్రిగుణ్ చెప్తాడు. ‍అలా వర్షిణి, త్రిగుణ్‌ ఒకరిపై ఒకరు పాత గొడవలు తీసుకొచ్చి విమర్శలు చేసుకుంటారు.

నువ్వు నన్ను కారెక్టర్ లెస్ అన్నావ్.. నేను నీకు సారీ ఎందుకు చెప్పాలి అని వర్షిణి అనగా.. నన్ను ఎన్నో మాటలు అన్నావ్.. నన్ను తొక్కేయాలన్నావ్.. కానీ నువ్వు మాత్రం నాకు సారీ చెప్పలేదు అని త్రిగుణ్ ఫైరవుతాడు. నన్ను క్యారెక్టర్ లెస్ అని ఎలా అంటావ్ అని వర్షిణి ఏడ్చేస్తూ చెబుతుంది. నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావ్.. కంట్రోల్ చేసుకో అని వర్షిణికి ముకేశ్ సలహా ఇస్తాడు. అలా చివరకు వర్షిణి పోటీ నుంచి తప్పుకుంటుంది. చివరికీ రామ్ ప్రసాద్, వంశీ, ముకేశ్, త్రిగుణ్ గేమ్ ఆడతారు. వీరికి ఆటోగ్రాఫ్ అనే ఛాలెంజ్ ఇస్తాడు. ఎవరు ఎక్కువ ఆటోగ్రాఫ్ చేసి బోర్డుకు అతికిస్తే వాళ్లే విన్ అవుతారని చెప్తాడు బిగ్‌బాస్. అలా ఈ ఆటలో చివరకు రాం ప్రసాద్ గెలిచి కెప్టెన్సీ రేస్‌లోకి వచ్చేస్తాడు.

అలా చివరి కెప్టెన్సీ కోసం ఆర్కే, దేబ్జానీ, అమన్, నరేశ్, సుధీర్, శివ, రామ్‌ప్రసాద్ పోటీ పడ్డారు. ఈ కంటెస్టెంట్స్‌కు స్వీట్ ఫ్యాక్టరీ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో నాన్ కంటెండర్స్ అందరూ తమ తలపై బాస్కెట్లను ధరించి.. పైనుంచి పడే క్యాండీలను పట్టుకోవాలి. వాటిని ఎవరైతే హౌస్‌లో కెప్టెన్ కావాలని భావిస్తున్నారో వాళ్ల బాక్స్‌లో వేయాలని బిగ్‌బాస్ చెప్తాడు. 

ఈ గేమ్ మొదటి రౌండ్‌లో శివ అవుటైనట్లు సంచాలక్ త్రిగుణ్ ప్రకటిస్తాడు. ఆ తర్వాత అమన్ బాక్స్‌ని త్రిగుణ్ ఎత్తి పడేయడంతో రెండో రౌండ్‌ సంచాలక్ అయిన శివ‌.. త్రిగుణ్‌ను డిస్ క్వాలిఫై చేస్తాడు. మూడో రౌండ్‌లో అమన్ సంచాలక్‌గా ఉండగా.. సుధీర్ అవుట్ అవుతాడు. ఆ తర్వాత సుధీర్ సంచాలక్‌ ఉన్నప్పుడు రామ్ ప్రసాద్, నరేశ్ గేమ్ నుంచి అవుట్ అవుతారు. చివరగా దేబ్జానీ, ఆర్కే నిలవడంతో.. సంచాలక్‌గా వచ్చిన రామ్ ప్రసాద్ అసలు ఫిజికల్ అవ్వొద్దని కండీషన్ పెడతాడు.

అయితే దీనిపై ఆర్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. మీ అందరికీ నాతో గేమ్ ఆడలేరా అంటూ ఛాలెంజ్‌ చేస్తాడు. మీకు నాతో దమ్ములేదా అంటూ సంచాలక్‌ రామ్‌ప్రసాద్‌తో వాదిస్తాడు. అవును మా అందరికీ నీతో ఆడే దమ్ము లేదంటూ ఆర్కేకి కౌంటరిస్తాడు. ఆర్కే ఎంత అరిచి గోలపెట్టినా అప్పటికే అందరూ కలిసి దేబ్జానీని కెప్టెన్‌ని చేయాలని ఫిక్స్ అవుతారు. ఆమె కోసమే సంచాలక్ రామ్ ప్రసాద్‌  ఫిజికల్ వద్దని కండీషన్ పెడతాడు. చివరికీ క్యాండీస్ లెక్క పెట్టకుండానే  దేబ్జానీని కెప్టెన్‌గా గెలిచినట్లు ప్రకటిస్తాడు  రామ్ ప్రసాద్. దీంతో బిగ్ బాస్ ఇంట్లో చివరి కెప్టెన్‌గా దేబ్జానీ నిలుస్తుంది. అలా ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement