‘‘ఒక నటిగా నా కంఫర్ట్ జోన్ దాటి కొత్త క్యారెక్టర్స్ చేయడానికి ట్రై చేస్తాను. కథ, అందులోని నా పాత్ర కొత్తగా ఉంటేనే ఒప్పుకుంటాను. ‘వృషకర్మ’లో అలాంటి పాత్రనే చేశాను’’ అన్నారు మీనాక్షీ చౌదరి. నాగచైతన్య, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘వృషకర్మ’. బాపినీడు సమర్పణలో ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి చెప్పిన విశేషాలు.
⇒ ‘వృషకర్మ’ సినిమాలో ఆర్కియాలజీలో థీసిస్ చేసే దక్ష పాత్ర చేశాను. ఈ క్యారెక్టర్ కోసం ఆర్కియాలజీ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాను. మామూలుగా నాకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయం. ఈ సినిమాలో ఎత్తైన ప్రదేశాలతో కూడిన సీన్స్ చాలా ఉన్నాయి. ఇవి సవాల్‌గా అనిపించినా ధైర్యంగా చేశాను. అలాగే చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ఉంటాయి... గ్రీన్‌మ్యాట్‌లో షూట్ చేశాం. మన ముందు ఎవరూ లేక పోయినా ఉన్నట్లు ఊహించుకుని నటించాలి. ఇది కొత్తగా అనిపించింది.
⇒ నేను దైవత్వాన్ని నమ్ముతాను. చెడుపై మంచి విజయం సాధిస్తుంది. ‘వృషకర్మ’ సినిమాలోనూ ఇదే చూస్తారు. ఇక నా చిన్నప్పుడు ఇంట్లో హారర్ సినిమాలు చూపించేవారు కాదు. ఎందుకంటే పీడ కలలు వస్తాయని వద్దని భయపెట్టేవారు. కాక పోతే పెద్దయ్యాక హారర్, థ్రిల్లర్, డిటెక్టివ్ సినిమాలంటే ఇష్టం ఏర్పడింది. ప్రస్తుతం కార్తీగారితో ఓ సినిమా చేస్తున్నాను. హిందీ, తమిళ ఇండస్ట్రీలో చేస్తున్న సినిమాల గురించి త్వరలో ప్రకటనలు వస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను.


