ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూన్‌వాక్’. మనోజ్ నిర్మల శ్రీధరన్ తెరకెక్కిస్తున్నారు. హాస్య నటుడు యోగిబాబు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. దీంతోపాటు ఓ పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘వీళ్లంతా బాగానే నవ్వుతున్నారు. థియేటర్లో ఆడియన్స్ నవ్వుతారో లేదో..’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రం డిసెంబరు 24న సినిమాను విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
(ఇదీ చదవండి: విరాట్ కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది)


