‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్‌ రివ్యూ | KTR about aakasam lo oka tara movie | Sakshi
Sakshi News home page

KTR : ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్‌ రివ్యూ

Nov 27 2026 7:52 PM | Updated on Nov 27 2026 7:53 PM

KTR about aakasam lo oka tara movie

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఇప్పటికే ఈ సినిమాను వీక్షించిన పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాని సైతం ఈ సినిమాను మెచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరారు.

‘అసాధ్యమైన కలలు కనడం.. వాటిని నిజం చేసుకోవడం అనే అద్భుతమైన ఆశయంతో కూడిన కథ ఇది. ‘ఆకాశంలో ఒక తార’ చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత అందమైన సినిమా చూడలేదు. దుల్కర్ సల్మాన్, శ్రుతిహాసన్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. తొలి సినిమాతోనే సత్తా చాటిన సాత్విక రవళ్లి నటన తనను ఆకట్టుకుంది’ అని కొనియాడారు.

కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నంనిర్మించారు. సాత్విక వీరవల్లి హీరోయిన్‌ కాగా.. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

(ఇదీ చదవండి: రామ్‌చరణ్‌తో నటించాలంటే.. ఇలా రండి: మైత్రీ మూవీ మేకర్స్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement