నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం’. ఇటీవలే ఈ సినిమాపై ఇతిహాసంలోని అంశాలను వక్రీకరించారంటూ గతంలో పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ అత్యవసర పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
మీరూ సినిమా తీయండి..
ఈ సినిమాను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ నవంబరు 23న నమోదైందని.. ఇప్పటివరకు విచారణకు రాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సినిమాలో అనేక వాస్తవాలను వక్రీకరించారని వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ బాగ్చి.. ‘వారు తమకు అర్థమైన విధంగా సినిమా తీశారు. మీకు అర్థమైన విధంగా మీరూ సినిమా తీయండి. కోర్టు సమయాన్ని వృథా చేయకండి. ఇతిహాసంపై మీకు భిన్నాభిప్రాయాలు ఉంటే.. వాటి ఆధారంగా మరో చిత్రాన్ని రూపొందించండి’ అని వ్యాఖ్యానించారు.
విచారణను త్వరగా చేపట్టాలని న్యాయవాది మరోసారి కోరగా.. తగిన సమయంలో పిటిషన్‌ను విచారణకు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. ఈ చిత్రం నవంబరు 5న థియేటర్లలో విడుదలైంది.
(ఇదీ చదవండి: ‘భోగి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


