వెంకటేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆయన హీరోగా మ్యూజికల్ సూపర్ హిట్ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. వచ్చేనెల 13న వెంకీమామ బర్త్ డే సందర్భంగా క్లాసిక్ లవ్ స్టోరీ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ కానుంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మరోసారి బిగ్ స్క్రీన్‌పై ఈ మూవీ అలరించనుంది.
ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రీతి జింటా హీరోయిన్‌గా మెప్పించింది. 1998లో రిలీజైన ఈ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వెంకీ, ప్రీతి జింటా మధ్య కెమిస్ట్రీ, ప్రేమ సన్నివేశాలు ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ భామ ప్రీతి జింటా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మూవీ ఇదే కావడం విశేషం.
ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద హిట్టయింది. రమణ గోగుల.. నిజం చెప్పమంటే, నైజాం బాబులు, నాలో ఉన్న ప్రేమ వంటి హిట్ సాంగ్స్ అందించారు. ఈ సాంగ్స్ మరోసారి అంటే డిసెంబర్ 13న ఎంజాయ్ చేయండి.
A timeless love story is all set to win our hearts once again❤️ Revisit the magic of Vintage Venky, Preity Zinta and the unforgettable melodies of #PremanteIdera on the big screen in stunning 4K 😍 Celebrating Victory Venkatesh’s birthday in cinemas on December 13, 2026 🎬 #PremanteIderaReRelease #PremanteIderaOnDec13 Victory @VenkyMama @realpreityzinta @JayanthCParanji @RamanaGogula @MangoMassMedia @adityamusic @PremanteIdera4k #BurugupalliSivaRamaKrishna #AshokKumarK #TeluguFilmNagar
— Telugu FilmNagar (@telugufilmnagar) November 26, 2026


