సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. లగ్జరీ కారు, నచ్చిన ఫుడ్‌తో పాటు ఎంతో గ్రాండ్‌గా కనిపిస్తుంటారు. తమకు ఏది కావాలనిపిస్తే అది ఠక్కున అలా వాళ్లు ముందుంటుంది. అంత లగ్జరీ లైఫ్‌ను సెలబ్రిటీలు ఆస్వాదిస్తుంటారు. ఎక్కడికెళ్లినా వాళ్ల లైఫ్ స్టైల్ రిచ్‌గానే ఉంటుంది. కానీ అందుకు తాను పూర్తిగా భిన్నం అంటున్నారు మన టాలీవుడ్ నటుడు జగపతిబాబు అలియాస్ జగ్గు భాయ్.
సినిమాల్లో ఫుల్ అగ్రెసివ్‌గా కనిపించే జగపతిబాబు.. రియల్ లైఫ్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. ఒక సామాన్యుడిలా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ వీడియోలు పోస్ట్ చేస్తూ అలరిస్తున్నారు. తాను ఎక్కడికెళ్లినా అభిమానులతో టచ్‌లోనే ఉంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
(ఇది చదవండి: ఓటీటీకి ఆదర్శకుటుంబం.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్..!)
తాజాగా జగపతిబాబు ఓ తోటలో కూలీ పనిచేసేవారితో భోజనం చేశారు. వాళ్లందరికీ ఆయన బిర్యానీ తెప్పించి.. తాను మాత్రం వాళ్లు తెచ్చుకున్న కూరలు రుచి చూశారు. మీరు ఏం తింటారో నాకు తెలియాలి.. అది నేను తింటానంటూ కూలీల తెచ్చుకున్న బాక్సుల్లోని అన్నం, కూరలు తిన్నారు మన జగ్గుభాయ్. వాళ్లకు మాత్రం బిర్యానీతో మంచి పార్టీ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే మన జగపతిబాబు ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో అర్థమవుతోంది. లైఫ్ అనే లగ్జరీలో కాదు.. సామాన్యులను కలవడంతో ఉందని నిరూపిస్తున్నారు.
Breaking News… Jantaki oka koora, 4 muddhala Annam thinni Rojjantha pani chesthuntey , noru oori valla bojjanam medha dhaadi chesadu Jaggu Bhai 😋 Idhiyemi Muchatooooo... https://t.co/YQ9pQReDcX
— Jaggu Bhai (@IamJagguBhai) November 26, 2026


