పాక్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్.. ముదురుతున్న గొడవ | Pak Series Netflix Issue And O Saathi Re Remake Details | Sakshi
Sakshi News home page

Pak Series Netflix: నెట్‌ఫ్లిక్స్ తెచ్చిన పంచాయితీ.. అసలేంటి గొడవ?

Nov 27 2026 5:10 AM | Updated on Nov 27 2026 5:10 AM

Pak Series Netflix Issue And O Saathi Re Remake Details

ఫిబ్రవరి 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ సంఘాలు.. పాకిస్తాన్ నటీనటులు, కంటెంట్‌పై పూర్తిస్థాయి నిషేధం ప్రకటించాయి. 2016 యూరీ దాడి తర్వాత మొదలైన ఆంక్షలు పుల్వామా ఘటనతో మరింత కఠినంగా మారాయి. చాలా ఏళ్ల తర్వాత దీని గురించి జనాలు మళ్లీ మాట్లాడుకునేలా చేసింది నెట్‌ఫ్లిక్స్. 'జో బచయ్ హైన్ సంగ్ సమాయిత్ లో' అనే పాక్ సిరీసే దీనికి కారణం. దీని కారణంగానే రోజురోజుకీ వివాదం ముదురుతోంది.

వచ్చే శుక్రవారం(డిసెంబర్ 04) నుంచి తొలిసారి ఓ పాకిస్తానీ సిరీస్‌ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.  దీన్ని మన దేశంలో నిషేధించాలని ఆల్ ఇండియా వర్కర్క్ యూనియన్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కూడా పాక్ కంటెంట్.. భారత్‌లో నిషేధించాలని ఓటీటీ సంస్థకు సూచించింది. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ మన దేశంలోని కొందరు నెటిజన్లు.. పాక్ సిరీస్‌కి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతుండగా, మరికొందరు వీళ్లని విమర్శిస్తున్నారు.

అంతెందుకు బాలీవుడ్ నటి రిచా చద్దా కూడా ఓ పోస్ట్ దిగువన పాక్ సిరీస్‌ని సపోర్ట్ చేస్తూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి వాళ్లందరూ మన దర్శకులు తీసిన రామాయణ, ధురంధర్ సినిమాలని పాక్‌లో నిషేధించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సిరీస్ గురించి కాసేపు పక్కనబెడితే వచ్చే శుక్రవారం ఇదే నెట్‌ఫ్లిక్స్‌లో 'ఓ సాతీ రే' అనే హిందీ సిరీస్ రిలీజ్ కానుంది. అదితీ రావు హైదరీ, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. విచిత్రం ఏంటంటే ఇది 2019-20 మధ్య స్ట్రీమింగ్ అయిన 'మేరే పాస్ తుమ్ హో' అనే పాక్ సిరీస్‌కి రీమేక్.

కంటెంట్‌కి బాష, ప్రాంతంతో సంబంధం లేదు గానీ భారత్-పాక్ మధ్య పరిస్థితుల దృష్ట్యా ఓ సిరీస్ కూడా పెద్ద వివాదానికి కారణమైంది. మరి ఈ విషయంలో సదరు నెట్‌ఫ్లిక్స్ ఏం చేస్తుందో చూడాలి? ఎందుకంటే ఈ ఓటీటీ సంస్థకు మన దేశంలోనే కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement