నిర్మాత అల్లు అరవింద్ మరో హీరోయిన్‌కి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అది కూడా హైదరాబాద్‌లోనే ఎవరినైనా చూసి సెటిలైపోమని అన్నారు. 'ఆకాశంలో ఒక తార' సక్సెస్ సెలబ్రేషన్ సందర్భంగా హీరోయిన్ రుహానీ శర్మ విషయంలో ఈ ఫన్నీ సంఘటన ఎదురైంది.
'మా సంస్థలో పనిచేసే అమ్మాయిలని కలిసినప్పుడు హైదరాబాద్‌లో ఎవరినైనా చూసుకుని ఇక్కడే సెటిల్ అవ్వొచ్చు కదా అని అడుగుతుంటా. మా కుటుంబంలో కూడా కొందరి పెళ్లిళ్లు హైదరాబాద్ అబ్బాయిలతోనే జరిగాయి. రుహానీని కూడా హైదరాబాద్‌లో ఎవరినైనా చూసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగా. దీనికి బదులిచ్చిన ఆమె..'ఇట్స్ ఎ బ్లెస్సింగ్' అని చెప్పింది. నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా అని సరదాగా అడిగా. రేపటి నుంచి మా ఆఫీసులో కూర్చో నీకు ఎవరినైనా చూసి పెళ్లి చేస్తా' అని అల్లు అరవింద్ అంటుంటే రుహానీ శర్మ నవ్వుతూ కనిపించింది.
గతంలో అల్లు అరవింద్ ఇలానే లావణ్య త్రిపాఠితో అన్నారు. కట్ చేస్తే కొన్నాళ్లకే మెగాహీర వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది. కానీ దాదాపు ఏడేళ్ల పాటు ఈ విషయాన్ని రహస్యంగా దాచారు. తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఓ కొడుకుతో హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. లావణ్య విషయంలో అల్లు అరవింద్ మాటలు నిజమైనట్లు.. రుహానీ విషయంలోనూ నిజమవుతాయేమో చూడాలి?
#AlluAravind: "Ruhani Sharma ని కూడా ఇక్కడే ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో అంటే... ‘It's a blessing’అన్నది" https://t.co/AQyaQjZddo
— Movies4u Official (@Movies4u_Officl) November 26, 2026
https://x.com/Movies4u_Officl/status/2125915104634130524/video/1


