ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలో పలువురు సినీతారల తమ వైవాహికబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా మరో నిర్మాత, సినీ రచయిత పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్‌కు చెందిన అమిత్ తులి తన ప్రియురాలు గరిమాను పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుక ఫోటోలను బాలీవుడ్ భామ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా.. అమిత్ తులి బాలీవుడ్‌లో ఆగస్టు 16, 1947, 31 అక్టోబర్ లాంటి సినిమాలు నిర్మించారు. అంతేకాకుండా షారూక్ ఖాన్ హీరోగా నటించిన డంకీ, జవాన్ చిత్రాలకు రైటర్‌పై పనిచేశారు. వీటితో పాటు మార్కెటింగ్ బిజినెస్‌లోనూ ఉన్నారు. స్టూడియో యూనీస్ పేరుతో మార్కెటింగ్ ఎజెన్సీ నడుపుతున్నారు. తాజాగా తన ప్రియురాలు మెడలో మూడు ముళ్లు వేశారు. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పలువురు బాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
My dear friend and colleague @StonyDaze wedding with his long time partner Garima. https://t.co/8HyYRKyoS5
— Kangana Ranaut (@KanganaTeam) November 25, 2026


