2025కి సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్‌గా హీరో బాలకృష్ణని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలానే ఈ జ్యూరీ కమిటీలో నిర్మాత అల్లు అరవింద్, సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభ సభ్యులుగా నియమించారు.
జాతీయ చలనచిత్ర పురస్కారాల జ్యూరీ నియామకానికి సంబంధించి అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేయాలని విజయవాడలోని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్ - ఎఫ్ఏసీ) ఎస్.సురేశ్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను వెలువరించారు.


