శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ భోగి. ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూడగానే ఆడియన్స్‌లో అంచనాలు మరింత పెంచేసింది. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో షోలు పడిపోయాయి. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అంటున్నారు. కొన్ని చోట్ల బోరింగ్ అనిపించిందని నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదని చెబుతున్నారు. అయితే కథ విషయానికొస్తే కొత్తదన లేదని.. రోటీన్‌గా అనిపించిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సెకండాఫ్ ఫుల్ ఎంగేజింగ్ ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో బీజీఎం అదిరిపోయిందని.. కొన్ని చోట్ల మరీ ఎక్కువైందని కామెంట్స్ పెడుతున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్‌లో హింస అతిగా ఉందంటున్నారు. సెకండాఫ్‌లో కాస్తా బోరింగ్‌గా అనిపించిందని.. క్లైమాక్స్ కూడా సాగదీసినట్లుగా ఉందని నెట్టింట తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. పూర్తి రివ్యూ కోసం సాక్షి.కామ్‌ను ఫాలో అవ్వండి.
#Bhogi Review:
— Urstruleysrinu (@Urstruleysrinu2) November 27, 2026
#BHOGI – A DISAPPOINTING FIRST HALF! 👎 Despite its attempt to recreate the raw, rustic feel of #Rangasthalam, the film lacks authenticity and emotional depth. Slow narration, weak elevations and forgettable songs make it a tedious watch. #Sharwanand shines in a few scenes, but the second half needs strong emotional moments to save the film #BhogiMovie #Bhogi
— Bagunda (@BagundaReviews) November 27, 2026


