వృషకర్మ రిలీజ్.. ప్రముఖ ఆలయంలో నాగచైతన్య పూజలు | Naga Chaitanya Visited Famous Temple Sri Kalahasthi | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: వృషకర్మ రిలీజ్.. శ్రీకాళహస్తిలో నాగచైతన్య పూజలు

Nov 27 2026 11:13 AM | Updated on Nov 27 2026 11:25 AM

Naga Chaitanya Visited Famous Temple Sri Kalahasthi

టాలీవుడ్ హీరో నాగచైతన్య మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కార్తీక్ దండు డైరెక్షన్‌లో చైతూ నటించిన లేటేస్ట్ యాక్షన్‌ అడ్వెంచర్ చిత్రం వృషకర్మ. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ డిసెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.

(ఇది చదవండి: ఓటీటీకి ఆదర్శకుటుంబం.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్..!)

ఈ మూవీ రిలీజ్‌కు ముందు నాగచైతన్య శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వృషకర్మ సినిమా సక్సెస్ కావాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగచైతన్యకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. చైతూ ఆలయాన్ని సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement