టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్‌లో జరిగిన దాడిపై డాన్సర్స్ అసోషియేషన్ అధ్యక్షురాలు సుమలత క్షమాపణలు కోరింది. ఫెడరేషన్‌తో కలిసి తాము పని చేయాలనుకంటున్నామని తెలిపింది. అలాగే అనిల్‌పై తాను చేసిన విమర్శలకు క్షమాపణలు కోరుతున్నానని ప్రకటించింది. డాన్సర్స్ అసోషియేషన్ వివాదాన్ని కొందరు తమ వ్యక్తిగత లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నించారని సుమలత ఆరోపించింది.
ఇకపై ఫిల్మ్ ఛాంబర్‌లో దాడులకు పాల్పడితే ఐదేళ్ల పాటు సహాయ నిరాకరణ ఉంటుందని ప్రసన్న కుమార్ తెలిపారు. అలాగే జానీ మాస్టర్‌పై నిషేధం తొలగిపోయి మళ్లీ టాలీవుడ్ సినిమాలకి పని చేయాలని వైవీఎస్ చౌదరి ఆకాంక్షించారు.

అసలేంటి వివాదం..
తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్’లో వరుస వివాదాలు కొనసాగుతున్నాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న సుమలత(జానీ మాస్టర్ సతీమణి)ను పదవి నుంచి తొలగిస్తూ.. ప్రస్తుత కార్యవర్గాన్ని ఫెడరేషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమలత, రఘు మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తనను అసభ్య పదజాలంతో దూషించారంటూ సుమలత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.


