విరాట్ కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది | Virat Karna Rustum Title Glimpse Primeshow | Sakshi
Sakshi News home page

విరాట్ కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది

Nov 27 2026 5:23 PM | Updated on Nov 27 2026 5:42 PM

Virat Karna Rustum Title Glimpse Primeshow

టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో భారీ చిత్రాలను నిర్మిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. నాగబంధం ఫేమ్‌ యువ హీరో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రుస్తుం’ అనే  టైటిల్‌ను ఖరారు చేసింది. 

విరాట్ కర్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా సినిమాలోని సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

ఈ సినిమాకి కనిష్క గంధం దర్శకత్వం వహిస్తున్నారు. కథ, కథనాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు వెండితెరపై చూడని విధంగా భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. టైటిల్ గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. 

(ఇదీ చదవండి: రామ్‌చరణ్‌తో నటించాలంటే.. ఇలా రండి: మైత్రీ మూవీ మేకర్స్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement