గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే వార్త అందించారు మైత్రీ మూవీ మేకర్స్. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్‌సీ17’ కోసం చిత్రబృందం నటీనటుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఈ సినిమాలో నటించాలని ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాన్ని కల్పిస్తూ మేకర్స్ అధికారికంగా ఆడిషన్స్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘కొత్త ప్రపంచం.. సరికొత్త కథ.. అందులో మీకో పాత్ర ఎదురుచూస్తోంది’ అంటూ క్యాస్టింగ్ ప్రకటనను పంచుకున్నారు. ఈ సినిమాలో నటించాలనుకునే వారు తమ ఆడిషన్ వీడియోలను src17casting@gmail.comకు పంపించాలని సూచించారు. ఇతర వివరాల కోసం 9110564651 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
ఇక సినిమా విషయానికొస్తే.. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా ఆడిషన్స్ ప్రకటన రావడంతో ఈ సినిమాలో అవకాశం కోసం ఔత్సాహిక నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు.
(ఇదీ చదవండి: AIతో ఉద్యోగాలు పోవడం లేదు: ఆర్జీవీ)
A new world. A new story. And maybe, a role that’s waiting for YOU ❤️🔥 The casting doors are now open for #RC17 🎯 We’re looking for actors across age groups to be a part of this exciting cinematic journey. Send in your auditions to src17casting@gmail.com 📲 WhatsApp: 9110564651 #YouCanImagine #RC2Sukku #SRC Mega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
— Mythri Movie Makers (@MythriOfficial) November 27, 2026


