చిన్న సినిమాలకు నాని బ్రాండ్‌ బలం: నిర్మాత దీప్తి | Producer Deepti Ganta Reveals How Nani's Support Helps Small Films Reach Audiences | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాలకు నాని బ్రాండ్‌ బలం: నిర్మాత దీప్తి

Nov 27 2026 7:15 PM | Updated on Nov 27 2026 7:20 PM

Deepthi Ganta About Nani

హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్‌ రుక్మిణీ’. నేచురల్‌ స్టార్‌ నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘దండోరా’ ఫేమ్‌ మురళీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆఫియా సయీద్‌ కథానాయికగా నటిస్తోంది. డిసెంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మూవీ ప్రమోషన్స్‌ జోరుగా చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే నిర్మాత దీప్తి గంటా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 

హీరో నాని అండగా నిలిస్తే
టాలీవుడ్‌లో చిన్న సినిమాలను థియేటర్లకు తీసుకెళ్లి ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంత సులభం కాదని అయితే అలాంటి సినిమాలకు హీరో నాని అండగా నిలిస్తే పరిస్థితి మారుతుందని నిర్మాత దీప్తి గంటా అభిప్రాయపడ్డారు. ‘మంచి కథలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు నాని బ్రాండ్‌ వాల్యూ ఎంతగానో ఉపయోగపడుతుంది. 
ఆయన ఓ సినిమాను సమర్పించడంతో పాటు స్వయంగా ప్రచారం చేస్తున్నారంటే.. అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. నాని సమర్పణలో వచ్చిన ‘కోర్ట్‌’ (Court) సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఆయన సమర్పించే చిత్రాలపై ప్రేక్షకుల్లో మరింత నమ్మకం పెరిగింది’అని  దీప్తి గంటా పేర్కొన్నారు. 

(ఇదీ చదవండి: రామ్‌చరణ్‌తో నటించాలంటే.. ఇలా రండి: మైత్రీ మూవీ మేకర్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement