breaking news
Alias Rukmini Movie
-
కృష్ణలో కొత్త కోణం
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘అలియాస్ రుక్మిణి’. ఈ చిత్రంలో ఆఫియా సయ్యద్ హీరోయిన్గా నటిస్తుండగా, సాయికుమార్, హర్షవర్ధన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాని సమర్పణలో మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో కృష్ణ పాత్రలో నితిన్, రుక్మిణి పాత్రలో ఆఫియా సయ్యద్ నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలోని యంగ్ కృష్ణ లుక్లో నితిన్ కనిపిస్తున్న పోస్టర్ను, ఇందుకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘కృష్ణ పాత్రలో నితిన్ కనిపిస్తున్న ఈ సరికొత్త మేకోవర్ ఆయన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది. యంగ్ కృష్ణను, అతడి కలలను, ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేసేలా ఈ వీడియో ఉంటుంది. నితిన్, ఆఫియా సయ్యద్ జోడీ ఈ సినిమాకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గానిన్. -
'రుకు రుకు రుక్మిణి.. ఫస్ట్ సాంగ్ రిలీజ్'
నితిన్ హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రం 'అలియాస్ రుక్మిణీ'. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబరు 04న రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో ఆఫియా సయీద్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 'రుకు రుకు రుక్మిణి.. ఒప్పేసుకో మారాణి..' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా.. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కుల్కర్ణి ఆలపించారు. ఈ సాంగ్ సినీ ప్రియులను తెగ అలరిస్తోంది. -
దసరా స్పెషల్.. టాలీవుడ్ కొత్త సినిమా పోస్టర్స్ కళకళ
దసరా చివరకొచ్చేసింది. పండగ శుభాకాంక్షలు చెబుతూ తెలుగు కొత్త సినిమా టీమ్స్ పోస్టర్స్ రిలీజ్ చేశాయి. వీటిలో నాగచైతన్య వృషకర్మ, ప్రియదర్శి 'ఇడుపు కాయితం', శర్వానంద్ 'జార్జ్ క్రిష్', నితిన్ 'అలియాస్ రుక్మిణీ', కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' తదితర చిత్రాలతో పాటు హుషారు 2, హైలెస్సో, బబ్లూ డబుల్ఎక్సెల్ చిత్రాలు ఉన్నాయి. సదరు పోస్టర్లపై మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఒకే ఫ్యామిలీలో వరస విషాదాలు.. ఏడాదిలో ముగ్గురు కన్నుమూత) -
'ఆలియాస్ రుక్మిణీ'గా ఆఫియా సయ్యద్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
అలియాస్ 'రుక్మిణీ' ఎవరో తెలిసింది
హీరోగా 'ద ప్యారడైజ్' చేసిన నాని.. నిర్మాతగా 'అలియాస్ రుక్మిణీ' అనే మూవీ చేస్తున్నాడు. నితిన్ హీరో కాగా 'దండోరా' తీసిన మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు. డిసెంబరు 04న థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఈ మధ్యే ప్రకటించారు. అయితే టైటిల్లో ఉన్నట్లు రుక్మిణీ పాత్ర చేస్తున్న హీరోయిన్ ఎవరా అనే సస్పెన్స్కి తెరదించారు. ఈ మేరకు ఓ వీడియోని వదిలారు.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి క్రేజీ సినిమా.. మహిళలు తప్పక చూడాలి)బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్.. 'అలియాస్ రుక్మిణీ' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈమె చేసిన తొలి హిందీ మూవీ 'ప్రేమకీతను' ఈ నెల ప్రారంభంలోనే రిలీజైంది. దక్షిణాది సూపర్ హిట్ 'ప్రేమలు'కి రీమేక్ ఇది. తాజాగా వదిలిన 'అలియాస్ రుక్మిణీ' టీజర్లో ఈమెని చూస్తుంటే అందంగా ఉంది! ఆఫియా వ్యక్తిగత విషయానికొస్తే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలాకు ఈమె మేనకోడలు అవుతుంది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత) -
నాని-నితిన్ 'అలియాస్ రుక్మిణీ' రిలీజ్ డేట్
కొన్నిరోజుల క్రితం 'ప్యారడైజ్' మూవీతో థియేటర్లలోకి వచ్చిన నాని.. అనుకున్నంతలా ఆకట్టుకోలేకపోయాడు. దీని రన్ దాదాపు పూర్తికావొస్తోంది. మరోవైపు నిర్మాతగా చేసిన ఓ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.ఓవైపు హీరోగా చేస్తున్నప్పటికీ మరోవైపు నిర్మాతగానూ నాని పలు సినిమాలు నిర్మిస్తున్నారు. అలా నితిన్ హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రం 'అలియాస్ రుక్మిణీ'. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకుడు. కొన్నాళ్ల క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది డిసెంబరు 04నే బిగ్ స్క్రీన్స్పైకి రానుందని వెల్లడించారు.ఇకపోతే రుక్మిణి అనే హీరోయిన్ పాత్ర ఎవరు చేస్తున్నారనేది వచ్చే మంగళవారం బయటపెట్టనున్నట్లు తెలిపారు. లెక్క ప్రకారం డిసెంబరు 04న ప్రభాస్ 'ఫౌజీ' రావాలి. కానీ దీని వర్క్ ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలో వాయిదా పక్కా అని తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగచైతన్య 'వృషకర్మ', విశ్వక్ సేన్ 'లెగసీ' చిత్రాల్ని ఈ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ లిస్టులోకి నాని-నితిన్ 'అలియాస్ రుక్మణీ' వచ్చి చేరింది.This December, Krishna’s LOVE has a STORY to tell ❤️ #AliasRukmini in cinemas WORLDWIDE on DECEMBER 4th. But who is Rukmini? You'll know on October 13th 😍 Natural Star @NameisNani presents @actor_nithiin in #AliasRukmini 🪑📚 Written & Directed by @Afilmby_Murali #AliasRukminiOnDec4th @UnanimousProds @DeepthiGanta1 @dopjomon @VijaiBulganin @artkolla @srujana_AJ #RekhaBoggarrapu #PrashanthMandava @SVR4446 #RamanaMadhavaram @Bharani_dharann @saregamasouth— Unanimous Productions (@UnanimousProds) October 9, 2026 -
నాని-నితిన్ 'అలియాస్ రుక్మిణీ'.. గ్లింప్స్ చూశారా?
'ప్యారడైజ్' సినిమాతో బిజీగా ఉన్న నాని.. నిర్మాతగా కొత్త మూవీ మొదలుపెట్టేశాడు. గత కొన్నిరోజుల నుంచి వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ నితిన్ హీరోగా కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దీనికి దర్శకుడు. తాజాగా టైటిల్ రివీల్ చేశారు. 'అలియాస్ రుక్మిణీ' అనే అచ్చ తెలుగు పేరుని ఫిక్స్ చేశారు.ఇంజినీరింగ్ బుక్స్ ముందేసుకుని పడుకునే హీరోని చూపిస్తూ.. గరం గోపాల్, ఆమెకు ఆమెంటే ఇష్టం, వ్రతం వెంకన్న పుస్తకాల్ని చూపించారు. వీటిని రాసింది రుక్మిణి అనే మహిళ. ఈమె ఎవరా అని మనం ఆలోచిస్తుండగా.. ఆమె నా భార్య అని హీరో పాత్రధారి అయిన నితిన్ చెప్పడం బాగుంది. మరి రొమాంటిక్ నవలలు రాసే భార్య ఉన్న హీరో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడనేది స్టోరీనా అనిపిస్తుంది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం బాగుంది.


