నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘అలియాస్ రుక్మిణి’. ఈ చిత్రంలో ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయికుమార్, హర్షవర్ధన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాని సమర్పణలో మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో కృష్ణ పాత్రలో నితిన్, రుక్మిణి పాత్రలో ఆఫియా సయ్యద్ నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలోని యంగ్ కృష్ణ లుక్‌లో నితిన్ కనిపిస్తున్న పోస్టర్‌ను, ఇందుకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘కృష్ణ పాత్రలో నితిన్ కనిపిస్తున్న ఈ సరికొత్త మేకోవర్ ఆయన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది. యంగ్ కృష్ణను, అతడి కలలను, ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేసేలా ఈ వీడియో ఉంటుంది. నితిన్, ఆఫియా సయ్యద్ జోడీ ఈ సినిమాకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గానిన్.


