కమల్ హాసన్ బర్త్‌ డే.. కల్కి టీమ్ స్పెషల్ విషెస్ | Kalki 2 Movie team Special Wishes To Kamal haasan Birthday | Sakshi
Sakshi News home page

Kalki 2 Movie: కమల్ హాసన్ బర్త్‌ డే.. కల్కి టీమ్ స్పెషల్ విషెస్

Nov 8 2026 1:30 AM | Updated on Nov 8 2026 1:30 AM

Kalki 2 Movie team Special Wishes To Kamal haasan Birthday

ప్రభాస్ హీరోగా వస్తోన్న సీక్వెల్ మూవీ కల్కి-2. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా కమల్ హాసన్ బర్త్ డే కావడంతో మూవీ టీమ్ స్పెషల్‌గా విషెస్ తెలిపింది.

కల్కి-2 షూటింగ్‌లోని పోస్టర్‌ పంచుకుంది. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా సు ప్రీమ్ యాస్కిన్ అవతారంలో ఉన్న కమల్ హాసన్ అరుదైన పిక్‌ను మేకర్స్ విడుదల చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. ముఖ్యంగా కల్కి 2లో ప్రభాస్, కమల్ హాసన్‌ల మధ్య ఉండే సన్నివేశాలు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు దీపికా పదుకొణె స్థానంలో సాయి పల్లవి నటిస్తున్నట్లు సమాచారం. ఈ ‘కల్కి 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని చిత్ర వర్గాల టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement