శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్‌లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇవాళ జరగనుందని ముందే అనౌన్స్ చేశారు. కానీ సాంకేతిక సమస్యలతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దర్శకుడు సంపత్ నంది ఈ విషయాన్ని వెల్లడించారు. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించడం.. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఈ మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
🙏🏾🙏🏾🙏🏾 https://t.co/hIdSgS2clo
— Sampath Nandi (@IamSampathNandi) November 7, 2026


