ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న సినిమా ‘మహాకాళి’. అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి, ఖుష్బూ, భూమి శెట్టి, రోహిత్ సారఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 8న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘అయిగిరి నందిని’ స్తోత్రం లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
స్మరణ్ సాయి సంగీత రూపకల్పన చేసిన ఈ పాటను అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయి చరణ్ పాడారు. ‘‘భక్తుల హృదయాల్లో నిలిచిన ‘అయిగిరి నందిని’ కొత్త శక్తిని జోడిస్తూ, దైవిక స్త్రీ శక్తికి, మహాకాళి అమ్మవారి మహిమాన్విత రూపానికి అద్భుతమైన నివాళిగా నిలుస్తుంది. ‘అయిగిరి నందిని’లోని భక్తి భావాన్ని, పవిత్రతను ఏమాత్రం తగ్గించకుండా సినిమాటిక్ స్కేల్‌లో రూపొందించాం. కొత్త తరం శ్రోతలకు ఈ స్తోత్రంలోని గొప్పతనం మరింత చేరువ అవుతుంది’’ అని యూనిట్ పేర్కొంది.


