ఓటీటీకి రూ.450 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Hanuman Ansh Movie Ott Date locked On This Ott Platform | Sakshi
Sakshi News home page

Hanuman Ansh Movie: ఓటీటీకి హనుమాన్ అంశ్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Nov 7 2026 12:15 AM | Updated on Nov 7 2026 12:15 AM

Hanuman Ansh Movie Ott Date locked On This Ott Platform

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ హనుమాన్ అంశ్. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులోనూ రిలీజైన ఈ మూవీ ఇక్కడ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను ‍అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ నవంబర్ 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సోని లివ్ వేదికగా ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ షేర్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement