‘రామాయణం’ విజువల్స్‌ పై డైరెక్టర్‌ శంకర్‌ ఏమన్నారంటే..? | Director Shankar About Ramayana Movie | Sakshi
Sakshi News home page

Ramayana Movie: ‘రామాయణం’పై డైరెక్టర్‌ శంకర్‌ ప్రశంసల వర్షం

Nov 6 2026 7:56 PM | Updated on Nov 6 2026 8:26 PM

Director Shankar About Ramayana Movie

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామాయణం’ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్‌ రాజమౌళి, మహేశ్‌బాబు, సందీప్‌ రెడ్డి వంగా, విజయ్‌దేవరకొండ వంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించగా ఇప్పుడీ  జాబితాలోకి  ప్రముఖ దర్శకుడు శంకర్ చేరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

గొప్ప అనుభూతిని కలిగిస్తున్నాయి
‘భారతీయ సినిమాలో ఇలాంటి విజువల్స్‌ను ఇప్పటివరకు చూడలేదు. నమిత్ మల్హోత్రా, నితేశ్ తివారీ భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గొప్ప నిర్మాణ విలువలు, మంచి రూపకల్పన, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన సంగీతం, భారీ సౌండ్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తున్నాయి’ అని శంకర్ పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో యశ్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ‘ప్రతి ఫ్రేమ్‌లో యశ్‌ను చూడటం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఎంతో ప్రేమించదగిన విలన్‌గా కనిపించారు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రణబీర్ కపూర్, సాయిపల్లవికి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా రణబీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాకి నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు. నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు.

(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్‌’ తప్పులు.. ‘రామాయణం’ నేర్చుకున్న పాఠాలు? )

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement