బైక్ రైడర్ గా 18 దేశాలు చుట్టివచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న సాహస యాత్రికుడు భరద్వాజ్ దాయాల దర్శకుడిగా ఒక కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. ఏఐ టెక్నాలజీని కొత్తగా ఉపయోగిస్తూ హైబ్రీడ్ సాంకేతికతతో "కిరికిరి" అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వన్ మ్యాన్ షో ఫిలింస్ బ్యానర్ పై రవికాంత్ వీరపల్లి నిర్మిస్తున్నారు.
ఈ ‘కిరికిరి’ సినిమా ఈ రోజు (శుక్రవారం) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. బాహుబలి నిర్మాత ప్రసాద్ దేవినేని, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు.
డైరెక్టర్ భరద్వాజ దాయాల మాట్లాడుతూ ‘ఎన్నో ఏళ్లుగా మన సినిమాల్లో సాంకేతిక వినియోగం పెరుగుతూ వస్తోంది. ఇప్పుడున్న సాంకేతికతలో మరో ముందడుగు ఏఐ. ఈ టెక్నాలజీతో అవుట్ ఆఫ్ ది వరల్డ్ కథలు తెరకెక్కిస్తాం’ అని అన్నారు.
(ఇదీ చదవండి: ప్రేమించినోడే వెన్నుపోటు పొడిచాడు..: హీరోయిన్ రెజీనా)


