సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘G.O.A.T’ (గోట్). ఎమ్ చంద్రశేఖర్ నిర్మాణంలో రూపొందుతోంది. ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ రోజు (గురువారం) ట్రైలర్ విడుదలైంది. క్రికెట్ నేపథ్యంలో తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
కాగా చిత్రంలో మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వీ, ఆడుకలం నరైన్, ఆనంద రామరాజు, పమ్మిసాయి, చమ్మక్‌చంద్ర, నవీన్ నేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కమర్షియల్ హంగులతో ఉంటూనే, నేటి యువతను ఆలోచింపజేసేలా ఈ కథనం ఉంటుందని సుధీర్ కెరీర్‌లో ఈ మూవీ ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని గతంలో చిత్ర యూనిట్ పేర్కొంది.
(ఇదీ చదవండి: ఆ అర్ధరాత్రి నడిరోడ్డుపై పిచ్చిదానిలా అరిచా..: కరీనా కపూర్ )


