2025 జనవరి 16న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన కత్తి దాడి ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. తాజాగా ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన అనుభవాలను సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పంచుకున్నారు. ఆ రాత్రి ఎదురైన భయానక పరిస్థితులను గుర్తు చేసుకుంటూ కరీనా భావోద్వేగానికి గురయ్యారు.
‘అబ్బా.. నువ్వు చనిపోతావా?’
కరీనా కపూర్ మాట్లాడుతూ.. ‘అది అర్ధరాత్రి సమయం. సైఫ్ ఒళ్లంతా రక్తంతో తడిసిపోయింది. నాకు కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా లేదు. టీషర్ట్‌తోనే పిచ్చిదానిలా కాపాడండి అంటూ రోడ్డుపైకి పరిగెత్తాను. ఆటో రిక్షాను ఆపమని గట్టిగా అరిచాను. లిఫ్ట్‌లో సైఫ్‌ను చూసినప్పుడు.. ‘సైఫ్ ప్లీజ్.. నన్ను వదిలి వెళ్లకు’ అని వేడుకున్నాను. మా కొడుకు తైమూర్ ‘అబ్బా.. నువ్వు చనిపోతావా?’ అని అడిగినప్పుడు నా గుండె పగిలిపోయింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
నడవలేని స్థితిలో
కత్తిపోట్ల కారణంగా సైఫ్‌కు తీవ్ర రక్తస్రావం జరిగింది. వెన్నుపాముకు గాయం కావడంతో నడవలేని పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో ఇంట్లో డ్రైవర్ లేకపోవడంతో తైమూర్, హరి అనే వ్యక్తితో కలిసి ఆటో రిక్షాలోనే సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అనంతరం సైఫ్ కోలుకున్నప్పటికీ.. ఆ ఘటన తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని కరీనా తెలిపారు.
(ఇదీ చదవండి: ‘రామాయణ’పై డైరెక్టర్ రాజమౌళి రివ్యూ )
Kareena Kapoor Khan narrating the terrifying incident of Saif Ali Khan getting stabbed, the people thought she stabbed saif and questioning why there were no servants at home, and Taimur asking his Abba, “Are you going to die?” My heart breaks for them. The entire incident was scary.
— r (@bekhayalime) November 4, 2026


