breaking news
karina kapoor
-
అవి బోర్ కొట్టేశాయి.. అందుకే ఆ పాత్రల్లో నటిస్తా : కృతి సనన్
మహిళా పాత్రలను ఎక్కువగా పురుషుల కోణంలోనే రూపొందిస్తుంటారని ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ అభిప్రాయపడ్డారు. కెరీర్ ఆరంభంలో తాను కూడా ఇలాంటి పాత్రలకే పరిమితమయ్యానని వెల్లడించారు. తాజాగా కరీనా కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘వాట్ ఉమెన్ వాంట్’ టాక్‌షోలో పాల్గొన్న ఆమె.. తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.‘గుడ్ గర్ల్’ పాత్రలకే పరిమితం చేశారు!కెరీర్ ప్రారంభంలో అందుబాటులో ఉన్న పరిమిత అవకాశాల్లోనే మంచి పాత్రలను ఎంచుకోవాల్సి వచ్చేదని కృతి సనన్ తెలిపారు. చాలా కాలం పాటు తనను కేవలం ‘మంచి అమ్మాయి’ తరహా పాత్రలకే పరిమితం చేశారని చెప్పారు. ‘మన సినిమాల్లో మహిళా పాత్రలను ఎక్కువగా పురుషుల కోణంలోనే రాస్తుంటారు. సంప్రదాయబద్ధంగా ఉండటం, సిగ్గుపడటం, ఎవరైనా ఇబ్బంది పెడితే హీరో వచ్చి కాపాడే వరకు ఎదురుచూడటం.. ఎప్పుడూ ఎలాంటి తప్పూ చేయకుండా ఉండటం వంటి లక్షణాలతోనే మహిళా పాత్రలను రూపొందిస్తుంటారు’ అని ఆమె పేర్కొన్నారు.రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తనకు ‘గుడ్ గర్ల్ సిండ్రోమ్’ ఉందని కృతి సరదాగా చెప్పారు. ఎప్పుడూ పద్ధతిగా ఉంటూ అందరినీ మెప్పించాలని ప్రయత్నించడం కొన్నిసార్లు విసుగు తెప్పిస్తుందని తెలిపారు. అందుకే తెరపై భిన్నమైన లక్షణాలున్న పాత్రలు చేయాలని, నటిగా తనను తాను కొత్తగా కనిపించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.నిర్మాతగానూ!‘హీరోపంతి’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృతి సనన్.. తన కెరీర్లో విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘దిల్వాలే’, ‘మిమీ’, ‘తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా’, ‘క్రూ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మిమీ’ చిత్రంలో నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. నటనతో పాటు సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగానూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు. (ఇదీ చదవండి: అతన్ని మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకుంటా.. తప్పేంటి? : రష్మిక మందన్న) -
వయసు పెరిగినా క్రేజ్ తగ్గని కరీనా..
-
ది బెస్ట్ టీం ఇదే: కరీనా కపూర్
ముంబై: బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్, కరీనా కపూర్‌ఖాన్ జంటగా నటిస్తున్నకొత్త సినిమా ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర బృందం షూటింగ్ కోసం ప్రస్తుతం చండీఘడ్‌లో ఉంది. పలు సన్నివేశాల షూట్ పూర్తి చేసుకున్న చిత్రబృందం సభ్యులు అందరూ సరదాగా పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో హీరో అమీర్‌ఖాన్, హీరోయిన్ కరీనా కపూర్, సినిమా యూనిట్‌తో పాటు అమీర్ భార్య కిరణ్‌రావు కూడా ఉన్నారు. దీంతో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ చిత్రం హీరోయిన్ కరీనా కపూర్ ఓ ఫోటోను తన ఇస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘ది బెస్ట్ టీమ్’ అని కామెంట్ చేశారు. ఇటీవల ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్ సమయంలో లీకైన కరీనా, అమీర్ ఖాన్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. View this post on Instagram The Best Team ❤️❤️❤️❤️ #lalsinghchaddha #chandigarhnights @nainas89 nainas89 @poonamdamania @makeupbypompy A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on Nov 11, 2019 at 2:02pm PST అమీర్ ఇటీవల ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించారు. లాల్‌సింగ్ చద్దా.. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది తన పుట్టిన 54వ పుట్టినరోజు సందర్భంగా అమీర్ ఖాన్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. 1994లో రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రంలో టామ్ హాంక్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసందే. -
తైమూర్ ఎంత క్యూట్‌గా గుడ్‌బై చెప్పాడో తెలుసా?
సెలబ్రెటీలు కావడానికి కొందరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ పుట్టుకతోనే సెలబ్రెటీ స్థాయి కొద్దిమందికి మాత్రమే వస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రెటీల కంటే ఈ స్టార్ కిడ్లకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటోంది. ఈ జాబితాలో మొదటివరుసలో ఉండేది మాత్రం తైమూర్. సైఫీనా (సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్) జంట ముద్దుల తనయుడు తైమూర్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ చోటా నవాబ్ బయట కనిపిస్తే చాలు.. కెమెరాలన్నీ తన వైపే తిరుగుతాయి. తనతో ఫోటోలు దిగాలని ఎంతో మంది ట్రై చేస్తుంటారు. తైమూర్ ప్రస్తుతం ప్లే స్కూల్‌కు వెళ్తున్నాడు. తైమూర్ వెంట మీడియా పడకుండా ఆయా సంరక్షిస్తూ ఉంటుంది. గతంలో ఓ అభిమాని తైమూర్‌తో ఫోటో దిగాలని ఆయాతో గొడవ పడిన వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు ఈ బుడ్డోడు. ఇంటి గేట్ ముందు ఉన్న మీడియా సిబ్బంది తైమూర్‌ను ఫోటోలు తియ్యాలని ప్రయత్నించారు. వారిని ప్రతిఘటిస్తూ తైమూర్‌ను వ్యక్తిగత సిబ్బంది తీసుకెళ్తుండగా... ఇవేమీ పట్టించుకోకుండా.. తన ముద్దు ముద్దు మాటలతో బై అని చెప్పిన వీడియా వైరల్ అవుతోంది. -
ఆ హీరోయిన్ డ్రెస్‌కి 25 ఏళ్లంట!
ముంబై: ప్రముఖ డైరెక్టర్ శశాంక్ ఘోష్ దర్శకత్వంలో బాలీవుడ్ నటులు సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖ తల్సానియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. ఈ మూవీ గత శుక్రవారం విడుదలయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం చూసి ప్రతి ఒక్కరు హిరోయిన్ల డ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కరీనా కపూర్ వేసుకున్న డ్రస్‌కి మహిళలు అంతా ఫిదా అయ్యారు. తాజాగా కరినా వేసుకున్న డ్రస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. ఈ సినిమాలోని వివాహ సన్నివేశంలో కరీనా కపూర్ వేసుకున్న డ్రస్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. ఆ డ్రస్ చూడడానికి చాలా కొత్తగా, అందంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డ్రెస్ 25 ఏళ్ల క్రితం డిజైన్ చేసినదట. ఈ విషయాన్ని అబుజానీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ ఆ డ్రెస్‌ను 25 ఏళ్ల క్రితం డిజైన్ చేశాం. మా ఫాక్టరీలోని ఓ పెట్టెలో దాన్ని ఉంచాం. ఓ రోజు ఫ్యాక్టరీలోని దాచిన దుస్తులన్ని బయటకు తీస్తుండగా నిర్మాత రియా మా ఫ్యాక్టరీకి వచ్చారు. ఆ సమయంలో రియాకు ఆ డ్రెస్ కన్పించింది. దాన్ని బయటికి తీయమని చెప్పారు. అది నచ్చడంతో దానిని లెహెంగాగా డిజైన్ చేయమన్నారు. స్కర్ట్, టాప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం చున్నీని వెరైటీగా డిజైన్ చేశాం. దాన్ని కరినాకు సరిపడేలా డిజైన్ చేశాం. పెళ్లి సీన్లో కరీనా ఆ డ్రెస్‌లో కన్పిస్తుంది’ అని అబుజానీ వెల్లడించారు. మరోవైపు ‘ వీరే ది వెడ్డింగ్’ సినిమా రెండు రోజులకే రూ.22.95 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. వీకెండ్ లోపు 35 కోట్లు దాటేలా ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. -
కళాకారులను గౌరవించే తీరు ఇదేనా!
సినీ తారలపై కొండంత అభిమానాన్ని చూపించే ప్రేక్షకులే... ఒక్కోసారి అదే తారలతో చాలా ఇబ్బందిగా కూడా ప్రవర్తిస్తుంటారు. ఇది కొత్త విషయమేం కాదు. పాత కాలంలో భానుమతి లాంటి గొప్ప నటికే అభిమానుల నుంచి ఇబ్బందులు తప్పలేదు. ఈ తరంలో ఐశ్వర్యారాయ్, జ్యోతికలాంటి స్టార్లు కూడా ఫ్యాన్స్ నుంచి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా కరీనాకపూర్ వంతు వచ్చింది. తన తాజా చిత్రం ‘గోరీ తేరే ప్యార్ మే’ ప్రమోషన్ నిమిత్తం ఆ చిత్ర కథానాయకుడు ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి జైపూర్‌లోని ఓ కాలేజ్‌కి వెళ్లారట కరీనా. అక్కడ స్టూడెంట్స్‌తో కలిసి ఆడిపాడి హడావిడి కూడా చేశారట. ఉన్నట్టుండి ఏమైందో ఏమో... అక్కడి స్టూడెంట్లు అత్యుత్సాహంతో రెచ్చిపోవడం మొదలుపెట్టారు. కేరింతలతో, ఈలలతో గోల గోల చేస్తూ... కరీనాను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. దాంతో ఖంగు తినడం కరీనా వంతైంది. పోలీసులు, కరీనా బాడీగార్డులు, చివరకు బౌన్సర్లు కూడా చేతులెత్తేయడంతో కరీనాకు అక్కడ్నుంచీ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకానొక దశలో కట్టలు తెగిన ఆవేశంతో విద్యార్థులపై చిందులు తొక్కేశారు కరీనా. ఈ క్రమంలో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారని సమాచారం. ‘‘నేను సినిమా హీరోయిన్ని మాత్రమే కాదు. ఓ స్త్రీని. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది. కళాకారులను గౌరవించే తీరు ఇదేనా. మీ గురువులు, తల్లిదండ్రులు మీకు నేర్పింది ఇదేనా’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారట. అభిమానం హద్దుమీరితే ఇలాగే ఉంటుంది మరి.


