ఆ హీరోయిన్‌ డ్రెస్‌ 25 ఏళ్లనాటిది

Kareena Dress From Veere Di Wedding Is 25 Years Old - Sakshi

ముంబై: ప్రముఖ డైరెక్టర్‌ శశాంక్‌ ఘోష్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ నటులు సోనమ్‌ కపూర్‌, కరీనా కపూర్‌, స్వరా భాస్కర్‌, శిఖ తల్సానియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్‌’. ఈ మూవీ గత శుక్రవారం విడుదలయి బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం చూసి ప్రతి ఒక్కరు హిరోయిన్ల డ్రెస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కరీనా కపూర్‌ వేసుకున్న డ్రస్‌కి మహిళలు అంతా ఫిదా అయ్యారు.  తాజాగా కరినా వేసుకున్న డ్రస్‌ గురించి ఓ ఆసక్తికరమైన విషయం​ బయటకి వచ్చింది.

ఈ సినిమాలోని వివాహ సన్నివేశంలో కరీనా కపూర్‌ వేసుకున్న డ్రస్‌ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అబుజానీ సందీప్‌ ఖోస్లా డిజైన్‌ చేశారు. ఆ డ్రస్‌ చూడడానికి చాలా కొత్తగా, అందంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డ్రెస్‌ 25 ఏళ్ల క్రితం డిజైన్‌ చేసినదట. ఈ విషయాన్ని అబుజానీ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

‘ ఆ డ్రెస్‌ను 25 ఏళ్ల క్రితం డిజైన్‌ చేశాం. మా ఫాక్టరీలోని ఓ పెట్టెలో దాన్ని ఉంచాం. ఓ రోజు ఫ్యాక్టరీలోని  దాచిన దుస్తులన్ని బయటకు తీస్తుండగా నిర్మాత రియా మా ఫ్యాక్టరీకి వచ్చారు.  ఆ సమయంలో రియాకు ఆ డ్రెస్‌ కన్పించింది. దాన్ని బయటికి తీయమని చెప్పారు. అది నచ్చడంతో దానిని లెహెంగాగా డిజైన్‌ చేయమన్నారు. స్కర్ట్‌, టాప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం చున్నీని వెరైటీగా డిజైన్‌ చేశాం. దాన్ని కరినాకు సరిపడేలా డిజైన్‌ చేశాం. పెళ్లి సీన్‌లో కరీనా ఆ డ్రెస్‌లో కన్పిస్తుంది’  అని అబుజానీ వెల్లడించారు.

మరోవైపు ‘ వీరే ది వెడ్డింగ్‌’  సినిమా రెండు రోజులకే రూ.22.95 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. వీకెండ్‌ లోపు 35 కోట్లు దాటేలా ఉందని బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top