బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ (Sonam Kapoor) రెండోసారి తల్లి కాబోతుంది. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌మీడియాలో క్రేజీగా పోస్ట్ చేసింది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, 2022లో వారికి వాయు అనే కుమారుడు జన్మించాడు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివబోతున్నట్లు ఆమె ప్రకటించింది.

కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే సోనమ్ ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత భర్త, పిల్లలే తన ప్రపంచం అంటూ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ, సోషల్‌మీడియాలో ఆమె ఎప్పుడూ కూడా యాక్టివ్‌గానే కనిపిస్తుంది. అయితే, తాజాగా సోనమ్ కపూర్ క్రేజీగా రెండో ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించగానే అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ డ్రెస్ ధరించి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ.. సంతోషంగా కనిపించింది.
నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనం 2007లో ‘సావరియా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ-6, బాంబే టాకీస్, ప్రేమ రతన్ ధన్ పాయో, నీర్జా, సంజు వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.


